Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు సినీ వర్గాలలోనే కాదు.. ఇటు రెండు రాష్ట్రాల రాజకీయాల వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో..

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

Pawan Mahesh

Updated On : September 26, 2021 / 2:47 PM IST

Pawan-Mahesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు సినీ వర్గాలలోనే కాదు.. ఇటు రెండు రాష్ట్రాల రాజకీయాల వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసిన వ్యాఖ్యలకు.. మంత్రులు, వైసీపీ నేతల నుండి తీవ్రమైన కౌంటర్లు కూడా వస్తున్నాయి. రాజకీయ అంశాలను పక్కనపెడితే.. సినీ పరిశ్రమలో మాత్రం పవన్ వ్యాఖ్యలకు మద్దతు లభిస్తుంది.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

పవన్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అగ్రెసివ్ స్పీచ్ వైరల్ అవుతుంది. నానీ లాంటి హీరోలు పవన్ కు మద్దతుగా ట్వీట్స్ చేస్తూనే ఏపీలో సినిమా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అయితే, ఇప్పుడు పవన్ మాట్లాడిన ఈ స్పీచ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. నిజానికి ఇది ఇప్పుడు చేసిన ట్వీట్ కాదు. ఎప్పుడో పదేళ్ల క్రితం మహేష్ చేసిన ట్వీట్. గతంలో పవన్ ఒక సందర్భంలో మాట్లాడిన స్పీచ్ పై మహేష్ అప్పుడు పొగుడుతూ ట్వీట్ చేశాడు.

Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

మహేష్ అప్పుడు చేసిన ట్వీట్.. పవన్ ఇప్పుడు చేసిన ట్వీట్ కు కూడా బాగా రిలేటెడ్ గా ఉండడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందటే.. ఎవరో చెప్తే విన్నాను నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడాడు అని, అది విని నేనేమి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి’ అని ఉంది. ఇది పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ కాగా నిన్నటి పరిస్థితికి బాగా సింక్ అయ్యేలా ఉండడంతో కొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.