Kiran Abbavaram : నీకు ర‌తిక లాంటి భార్య రావాలన్న నెటిజ‌న్‌.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌మాధానం ఏంటంటే..?

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెలుతున్న యంగ్ హీరో కిర‌ణ్‌ అబ్బ‌వ‌రం. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం రూల్స్ రంజన్

Kiran Abbavaram chit chat

Kiran Abbavaram chit chat : జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెలుతున్న యంగ్ హీరో కిర‌ణ్‌ అబ్బ‌వ‌రం. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం రూల్స్ రంజన్. రత్నం కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్‌ నేహాశెట్టి హీరోయిన్‌. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఈ క్ర‌మంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ట్విట‌ర్‌లో చాట్ నిర్వ‌హించారు. ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌దాగా బ‌దులు ఇచ్చారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారి నుంచి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటీ అన్న ప్ర‌శ్న‌కు త‌న యాక్టింగ్ చాలా నేచుర‌ల్ ఉంటుంద‌ని చాలా మంది చెప్పిన‌ట్లు కిర‌ణ్ చెప్పారు. అదే త‌న‌కు గొప్ప ప్ర‌శంస అని అన్నారు. రూల్స్ రంజ‌న్‌లో యాక్ష‌న్ సీక్వెన్‌లు ఉంటాయా..? అని అడ‌గ‌గా.. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను ఈ సినిమాలో ఉండ‌వు. అస్స‌లు అలాంటి ఈ చిత్రం నుంచి ఆశించ‌వ‌ద్ద‌ని చెప్పాడు. కేవ‌లం కామెడీ మాత్ర‌మే ఉంటుంద‌ని, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు చాలా బాగా న‌చ్చుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

Month of Madhu : లవర్స్ కోసం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సీక్రెట్ స్క్రీనింగ్.. మీరుకూడా వెళ్తారా..?

ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొంటున్నారు అని ఓ ప్ర‌శ్న ఎదురుకాగా.. ట్రోలింగ్ అనేది జీవితంలో త‌ప్ప‌ద‌ని, ట్రోలింగ్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకుంటూ బ‌దులు ఇస్తాన‌న్నారు. అభిమానుల అండ ఉందని తెలిపారు. రూల్స్ రంజ‌న్ హిట్ అయ్యాకా నీకు ర‌తిక లాంటి అమ్మాయితో పెళ్లి అవ్వాల‌ని కోరుకుంటున్నా అన్నా అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. “బాబు గుడుంబా.. ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. ఎలాంటి అమ్మాయి వ‌స్తుందో చూద్దాం.” కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి సెకండ్ సింగల్ వచ్చేసింది.. ఉడతా ఉడతా ఉష్..

ట్రెండింగ్ వార్తలు