Karthikeya 2 : సీరియల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్.. ప్రమోషన్స్ లో కొత్త స్టంట్..

కార్తికేయ 2 ప్ర‌మోష‌న్ కోసం జీ తెలుగులో ప్ర‌సార‌మ‌య్య పాపుల‌ర్ డైలీ సీరియ‌ల్ రాధ‌మ్మ కూతురు ఎపిసోడ్‌లో ప్ర‌త్యక్ష‌మ‌య్యాడు నిఖిల్‌. ఇందులో ఓ సీన్ లో ప్రత్యక్షమై ఫైట్ చేశాడు, కొన్ని డైలాగ్స్ కూడా...........

Karthikeya 2 :  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

Star Hero’s : సినిమాల కోసం జిమ్‌లో కష్టాలు పడుతున్న స్టార్ హీరోలు

 

కార్తికేయ 2 శాటిలైట్, ఓటీటీ హక్కులని ముందుగానే జీటీవీ కొనడంతో సరికొత్త ప్రమోషన్స్ కి తెరలేపారు. జీటీవిలో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకోసం స్వయంగా హీరో నిఖిల్ రంగంలోకి దిగాడు. కార్తికేయ 2 ప్ర‌మోష‌న్ కోసం జీ తెలుగులో ప్ర‌సార‌మ‌య్య పాపుల‌ర్ డైలీ సీరియ‌ల్ రాధ‌మ్మ కూతురు ఎపిసోడ్‌లో ప్ర‌త్యక్ష‌మ‌య్యాడు నిఖిల్‌. ఇందులో ఓ సీన్ లో ప్రత్యక్షమై ఫైట్ చేశాడు, కొన్ని డైలాగ్స్ కూడా చెప్పాడు. ఇలా సీరియల్ లో కనపడి అందరికి షాకిచ్చాడు నిఖిల్. దీంతో లేడీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చని ప్లాన్ చేశారు. నిఖిల్ ఈ ఎపిసోడేకి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు