కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకు నితిన్ సాయం..

క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో నితిన్‌..

  • Publish Date - March 23, 2020 / 02:07 PM IST

క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో నితిన్‌..

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడానికి పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు.
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని హీరో నితిన్ నిర్ణ‌యించుకున్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని యువ నటుడు నితిన్ ప్ర‌క‌టించారు.

మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌నీ, అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో పాలు పంచుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. కాగా కరోనా కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘భీష్మ’ చిత్రంతో సక్సెస్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’, ‘చదరంగం’ సినిమాలు చేస్తున్నాడు.