Nithin: ప్లాప్స్ వచ్చినా తగ్గేదే లే.. నితిన్ ప్లానింగ్ మాత్రం మాములుగా లేదుగా
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన హీరో నితిన్(Nithin).
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 06:06 PM IST
Hero Nithin signs three movies at once
- స్పీడ్ పెంచిన హీరో నితిన్
- ఒకేసారి మూడు సినిమాలతో
- సంక్రాంతి బరిలో కామెడీ ఎంటర్టైనర్
Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ స్పీడ్ పెంచారు. వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే, మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు నితిన్.
ఇటీవల ‘ఆయ్’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన దర్శకుడు అంజి. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ దర్శకుడు ఇటీవల చెప్పిన కథకు నితిన్(Nithin) ఫిదా అయ్యాడట. కథ బాగా నచ్చడంతో నితిన్ వెంటనే పచ్చజెండా ఊపేశాడట. అంతేకాదు, తన బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ లోనే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట.
Sahithi Dasari: ట్రెండీ లుక్స్ లో దాసరి సాహితి.. అందాలు చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట నితిన్. ఈ రెండ్లు ప్రాజెక్టులు ఇంకా కంప్లీట్ అవకుండానే, నితిన్ మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ఒక కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టు ద్వారా పరిచయం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏప్రిల్ లోనే ఈ సినిమా గ్రాండ్‌గా స్టార్ట్ కానుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ నితిన్ తన డైరీని ఫుల్ బిజీగా మార్చుకుంటున్నారు. చాలా కాలంగా హిట్స్ లేని నితిన్ ఈ సినిమాలతో పక్కాగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడట. మరి నితిన్ చాలా ఆశలు పెట్టుకున్న ఈ మూడు సినిమాలు ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి అనేది చూడాలి.
