ఫూల్స్ ఎవరు రామ్?.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రామ్ సంచలన ట్వీట్స్..

  • Publish Date - August 15, 2020 / 02:41 PM IST

సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.



హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు? పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది.. సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి ఆయన కింద ప‌ని‌చేసే కొంత‌మంది ఆయనకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల సీఎం రెప్యుటేష‌న్‌కీ‌, ఆయన మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం.. అంటూ రామ్ చేసిన ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి.



అగ్నిప్రమాద ఘటనను ఫీజులవైపు మళ్లిస్తున్నారంటూ రామ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనా రాహిత్యంగా భావించవచ్చని.. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం విజయవాడలో 17 ప్రైవేట్ హోటల్స్‌లో 110 గదులను క్వారంటైన్ సెంటర్లుగా కేటాయించిందని అక్కడ అన్నిరకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆదేశాలమేరకు జరుగుతున్నాయని, స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పూర్తి వైఫల్యం రమేష్ హాస్పిటల్ వైపు నుంచే ఉందని తేల్చేశారు విశ్లేషకులు.. ఎవరు ఫూల్స్? అంటూ రామ్‌కు కౌంటర్స్ కూడా మొదలయ్యాయి. రామ్ ట్వీట్ల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.





ట్రెండింగ్ వార్తలు