Sharwanand: వెండితెరకు సాష్టాంగ నమస్కారం.. బైకర్ థియేటర్ లో శర్వానంద్ ఎమోషనల్ మూమెంట్

బైకర్ మూవీ థియేటర్ లో భావోద్వేగానికి లోనైన హీరో శర్వానంద్(Sharwanand). వెండితెరకు సాష్టాంగనమస్కారం.

Hero Sharwanand Prostrates Before the Silver Screen

  • థియేటర్ లో సందడి చేసిన శర్వానంద్
  • ప్రేక్షకులను చూసి భావోద్వేగం
  • వెండితెరకు సాష్టాంగ నమస్కారం

Sharwanand: టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బైకర్’. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారతీయ వెండితెరపై తొలి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు శర్వానంద్ శనివారం మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌ను సందర్శించారు.

Jailer 2: చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజినీ.. ‘జైలర్ 2’ రిలీజ్ అప్డేట్ ఇచ్చేశాడు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ

సీనియర్ నటుడు రాజశేఖర్, దర్శకుడు అభిలాష్‌తో కలిసి ఆయన ప్రేక్షకులతో సందడి చేశారు. థియేటర్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడటం చూసి శర్వానంద్(Sharwanand) ఉద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌కు పునాది వేసిన వెండితెరకు కృతజ్ఞతగా ఆయన బిగ్ స్క్రీన్‌ను తాకి, సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ అపూర్వ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, ‘బైకర్’ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని, దర్శకుడు అభిలాష్ ప్రతిభ వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. రాజశేఖర్ కూడా సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ రేసింగ్ ఎంటర్టైనర్ ప్రస్తుతం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీకెండ్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.