×
Ad

Shivraj Kumar: విజయ్ ఏదైనా చేసేముందే ఆలోచించాలి.. కరూర్ ఘటనపై శివరాజ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కరూర్ ఘటనపై స్పందించారు(Shivraj Kumar). ఏదైనా చేసేముందు జాగ్రత్త పడాలని విజయ్ కి సూచించాడు. ఇటీవల హీరో శివరాజ్ కుమార్త మిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు.

Hero Shivraj Kumar's shocking comments on Karur accident

Shivraj Kumar: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కరూర్ ఘటనపై స్పందించారు. ఏదైనా చేసేముందు జాగ్రత్త పడాలని విజయ్ కి సూచించాడు. ఇటీవల హీరో శివరాజ్ కుమార్త మిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. దర్శనం (Shivraj Kumar)అనంతరం విలేకరులతో మాట్లాడారు శివరాజ్ కుమార్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “నా స్నేహితుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నా. కానీ, కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. కరూర్ తొక్కిసలాట ఎలా జరిగిందో నాకు తెలియదు. కాబట్టి, విజయ్ మరింత జాగ్రత్తగా ఉండాలి. తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు శివరాజ్ కుమార్.

Keerthy Suresh: కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్.. చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమా.. కనీసం ఇప్పుడైనా..

ఇక, విజయ్ కరూర్ సభల్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం తమిళనాడులో రాజకీయ పరంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీలో ప్రోటోకాల్‌లను పాటించనందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగంపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ర్యాలీకి కేవలం 10,000 మందికి అనుమతి తీసుకున్నప్పటికీ, 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు విజయ్.

ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ ప్రస్తుతం జన నయగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శివరాజ్ కుమార్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే తన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.