Thrigun : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన రెండవ కంటెస్టెంట్.. హీరో త్రిగుణ్.. హీరోగా సినిమాలు చేసి..

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. (Thrigun)

  • Published on- September 6, 2026 / 07:42 PM IST

Thrigun

Thrigun : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు.

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. దాదాపు 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. 2009 లో కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా ఆ తర్వాత హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్ లో హీరోగా, కీలక పాత్రల్లో దాదాపు 30 సినిమాలు చేసాడు. కథ, తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా, చెన్నై లవ్ స్టోరీ.. లాంటి అనేక సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు.

Also Read : Debjani Modak : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన మొదటి కంటెస్టెంట్.. ‘దేబ్జానీ మోదక్’ గురించి తెలుసా..

అయితే ఇన్ని సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. నాగార్జున తో మాట్లాడుతూ.. తన సంవత్సరం వయసు ఉన్న బాబుని వదిలేసి హౌస్ లోకి వచ్చాను అని చెప్పాడు. హౌస్ లోకి వెళ్లేముందు నాగార్జున త్రిగుణ్ కి టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్ లో దయ్యం ఉందని వరం రోజుల్లో కనీసం ముగ్గురు నమ్మాలి అనే టాస్క్ ని ఇచ్చారు నాగార్జున.