×
Ad

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు.. సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ (Vijay Deverakonda)కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే.

Hero Vijay Deverakonda attends CID SIT inquiry

Vijay Deverakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగానే విజయ్ ని కూడా(Vijay Deverakonda) విచారించింది సిట్. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను ఎలా కలిశారు, వాళ్ళతో డీలింగ్ ఎలా జరిగింది, డబ్బులు ఎలా తీసుకున్నారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు విచారించినట్టుగా సమాచారం. ఈ కేసులో రానా, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ లాంటి వారికి కూడా నోటీసులు అందాయి. త్వరలోనే మరింత మందిని లిస్టు చేర్చి విచారించే అవకాశం ఉందని సమాచారం.

Payal Rajput: శృంగారం తప్పు కాదు.. ఎందుకు సిగ్గుపడాలి.. బోల్డ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

ఇక విజయ్ దేవరకొండ గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. వాటిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఆయన రౌడీ జనార్ధన సినిమా సినిమా చేస్తన్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశము ఉంది.