Payal Rajput: శృంగారం తప్పు కాదు.. ఎందుకు సిగ్గుపడాలి.. బోల్డ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఒకటి (Payal Rajput)రెండు మినహాయిస్తే ఈ అమ్మడు చేసిన సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.
Heroine Payal Rajput shocking comments on sex education
Payal Rajput: టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఒకటి రెండు మినహాయిస్తే(Payal Rajput) ఈ అమ్మడు చేసిన సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా RX100 గురించి ఎంత చెప్పినా తక్కువే. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను, ప్రత్యేకంగా కుర్రకారును ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ చేసిన పాత్ర గురించి, ఆ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందు పాత్రలో సమాజంలోని కొంతమంది అమ్మాయిల బిహేవియర్ ను అనుసరిస్తూ ఆమె చేసిన ఈ పాత్ర సినిమాకె హైలెట్ గా నిలిచింది.
Charan-Sandeep: వైలెంట్ కాంబో లోడింగ్.. రీసెంట్ గా కలిసిన స్టార్స్.. త్వరలోనే..
బోల్డ్ సీన్స్ లో కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా నటించింది పాయల్. ఆ తరువాత కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది కానీ, అవి అంతగా సక్సెస్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన మంగళవారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో కూడా బోల్డ్ పాత్రలో కనిపించి మరోసారి తనదైన నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బోల్డ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ చేసింది. “శృంగారం అనేది మన జీవితం లో ఒక భాగం. దాని గురించి మాట్లాడటానికి సిగ్గు ఎందుకు. ప్రతీ ఒక్కరు దానికి నార్మల్ గా విషయంలా డిస్కస్ చేసుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రతీఒక్కరికీ సరైన అవగాహన ఉండాలి, ముఖ్యంగా యువతకి.
అలాగే, మంత్స్ సమయంలో ఆడవాళ్ళూ ఎదుర్కొనే పెయిన్, ఇష్యూస్, ఒత్తిడి లాంటి విషయాల గురించి సినిమాల్లో చూపించడం వల్ల చాల కొంత అవగాహన కల్పించవచ్చు. ఇలాంటి విషయాల గురించి ఓపెన్‌గ చర్చించడం మంచిది. దానివల్ల మరింత అవగాహన పొందే అవకాశం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దాంతో, పాయల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా చాలా మంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
