×
Ad

Adah Sharma: వాళ్ళు చంపేస్తాం అన్నారు.. వీళ్ళు కాపాడుతూ వచ్చారు.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్

అదా శర్మ, ఈ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్ కి కొత్త పరిచయం అవసరం లేదు. (Adah Sharma)నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

Heroine Adah Sharma shocking comments on The Kerala Story movie

Adah Sharma: అదా శర్మ, ఈ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్ కి కొత్త పరిచయం అవసరం లేదు. నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అంతేకాదు, యావరేజ్ గా (Adah Sharma)నిలిచిన ఈ సినిమా ఆడియన్స్ కి ఇంకా గుర్తుంది అంటే దానికి కారణం అదా శర్మ అనే చెప్పాలి. కెరీర్ ముందు నుంచే రెగ్యులర్ సినిమాకు కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

Chiru-Bobby: మెగా ప్రాజెక్టు నుంచి మిరాయ్ డైరెక్టర్ ఔట్.. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టెక్నీషియన్ కి ఛాన్స్.. అయితే ఇది కూడా..

ఇక ఇటీవల ఆమె నటించిన సంచలన సినిమా “ది కేరళ స్టోరీ”. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా పలు వివాదాలను క్రియేట్ చేసింది. బ్యాన్ లు, బైకాట్ లు ఒక రేంజ్ లో నడిచాయి ఈ సినిమాపై. అయినా కూడా సినిమాను విడుదల చేసి విజయం సాధించారు మేకర్స్. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంది అదా శర్మ. ఈ విషయాల గురించి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది అదా. అంతేకాదు, చాలా మంది ఆమెను చంపేస్తామని బెదిరించారట కూడా.

ఇంకా ఈ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ.. “ముందు నుంచి నేను ధైర్యమైన కథలు ఎంచుకున్నాను. ‘ది కేరళ స్టోరీ’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా విడుదల సమయంలో సగం మంది నన్ను చంపాలని చూశారు, మిగతా సగం మంది మాత్రం నన్ను కాపాడుతూ వచ్చారు. అయినా కూడా సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకుంటాను. పాత్రలో ఎమోషన్ లేకపోతే ఆసక్తిగా అనిపించదు. యాక్షన్‌ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ఛాలెంజింగ్స్ ఉండాలి. అలాంటి రోల్స్‌ అంటేనే నాకు ఇష్టం. నా ఫ్యామిలీ కొన్నిసార్లు ఆందోళన చెందుతారు, కానీ నేను హ్యాపీగా ఫీలవుతాను” అంటూ చెప్పుకొచ్చింది అదా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.