Krithi Shetty: నాన్న ఆలస్యంగా రావడం వల్ల హీరోయిన్ అయ్యాను.. లేదంటే అక్కడే అలా.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అందరికీ ఒకేలాంటి అవకాశం ఇవ్వదు. కొంతమందికి కష్టంగా.. కొంతమందికి చాలా సులభంగా అవకాశం లభిస్తుంది(Krithi Shetty). చాలా కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసివస్తుంది.
- V Santhosh Kumar
- Published On : November 29, 2025 / 09:11 AM IST
heroine krithi shetty made interesting comments about her film career
Krithi Shetty: సినిమా ఇండస్ట్రీ అందరికీ ఒకేలాంటి అవకాశం ఇవ్వదు. కొంతమందికి కష్టంగా.. కొంతమందికి చాలా సులభంగా అవకాశం లభిస్తుంది. చాలా కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసివస్తుంది. కానీ, కృతి శెట్టికి మాత్రం వాళ్ళ నాన్న ఆలస్యంగా రావడం వల్ల హీరోయిన్ అవకాశం వచ్చిందట. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపధ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తన సినిమా కెరీర్ ఎలా మొదలయ్యింది అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది.
Kajol: పెళ్ళికి ఎక్స్‌పైరీ డేట్.. అనాల్సినవి అనేసి పట్టించుకోవద్దు అంటారా.. భగ్గుమంటున్న నెటిజన్స్
“నేను మొదట ఒక వాణిజ్య ప్రకటన కోసం ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆడిషన్ పూర్తయ్యాక నన్ను తీసుకెళ్లడానికి డాడీ వస్తా అన్నాడు. కానీ, ఆయన రావడం కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్లాను. అక్కడ వేరే ఒక్క సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు నన్ను చూసి మీకు సినిమాల్లోనే నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. వారికి ఎం చెప్పాలో తెలియక మా అమ్మ నంబర్ ఇచ్చి వచ్చాను. తరువాత వాళ్ళు అమ్మకి కాల్ చేయడం.. సినిమాలో ఒకే అవడం చకా చకా జరిగిపోయాయి. అలా బుచ్చిబాబు గారు చేసిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను”అంటూ చెప్పుకొచ్చింది.
అయితే, ఉప్పెన సినిమాతో తన కెరీర్ ని బ్లాక్ బస్టర్ గా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ కానీ, ఆ తరువాత ఒక్క హిట్ కూడా లేదు ఈ అమ్మడుకు. నాని తో శ్యామ్ సింగా రాయ్, నాగ చైతన్యతో బంగార్రాజు, కస్టడీ, రామ్ తో ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శర్వానంద్ తో మనమే వంటి సినిమాలు చేసింది. అన్నీ ప్లాప్ గా నిలిచాయి. ఇప్పుడు చాలా కాలం తరువాత తమిళ ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. మరి ఈ సినిమాలతో అయినా హిట్ అందుకుంటుందా చూడాలి.
