Trisha : త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. లీగల్‌గా చూసుకుంటా అంటున్న హీరోయిన్..
తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్ త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్ చేసాడు. ఆ వ్యాఖ్యలు పై త్రిష రియాక్ట్ అవుతూ..
- gum 95921
- Published on- February 20, 2024 / 06:53 PM IST
Heroine Trisha fires on aiadmk leader derogatory comments
Trisha : స్టార్ హీరోయిన్ త్రిష.. గత దశాబ్దాలు కాలంగా తన స్టార్ స్టేటస్ ని అలాగే మెయిన్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇన్నాళ్ల ప్రయాణం త్రిష పై ఎన్నో ఇబ్బందికర వార్తలు, వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఈమధ్య కాలంలో ఆమె పై వస్తున్న కొన్ని లైంగిక కామెంట్స్.. ఆమెతో పాటు అభిమానులను, సెలబ్రిటీస్‌ని సైతం ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇటీవల ‘లియో’ సినిమా సమయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు పై చిరంజీవి నుంచి అందరూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆ విషయంలో మన్సూర్ ని న్యాయస్థానం గట్టిగా మందలించింది. ఇక ఆ గొడవ అయ్యిపోయింది అనుకునేలోపే.. మరో గొడవ తెరపైకి వచ్చింది. తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్.. త్రిష పై చీప్ కామెంట్స్ చేసాడు. డబ్బులిచ్చి త్రిషని రిసార్ట్‌కు పిలుపించుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలు పై త్రిష అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read : Karthika Deepam : ‘కార్తీక దీపం’ సీరియల్ మళ్ళీ వస్తుంది.. సీరియల్స్‌లో కూడా సీక్వెల్..!
ఇక ఈ కామెంట్స్ పై త్రిష రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసారు. “దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోయే నీచమైన మనుషులను పదేపదే చూడటం అసహ్యంగా ఉంది. దీనిపై అవసరమైన మరియు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇకపై చెప్పవల్సింది, చేయవల్సింది అంతా నా న్యాయ విభాగం నుండి ఉంటుంది” అంటూ త్రిష గట్టి వార్నింగ్ ఇస్తూనే ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
