Karthika Deepam : ‘కార్తీక దీపం’ సీరియల్ మళ్ళీ వస్తుంది.. సీరియల్స్‌లో కూడా సీక్వెల్..!

'కార్తీక దీపం' సీరియల్ మళ్ళీ రాబోతుందట, కానీ సరికొత్తగా. సీరియల్స్ లో కూడా సీక్వెల్ కల్చర్ స్టార్ట్ కాబోతుందా..

Karthika Deepam : ‘కార్తీక దీపం’ సీరియల్ మళ్ళీ వస్తుంది.. సీరియల్స్‌లో కూడా సీక్వెల్..!

Telugu Super Hit Serial Karthika Deepam is again come with new version

Updated On : February 20, 2024 / 6:15 PM IST

Karthika Deepam : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతోగానో ఆకట్టుకొని, సీరియల్స్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్న ధారావాహిక నాటికలు కొన్ని ఉన్నాయి. వాటిలో స్థానం దక్కించుకున్న చక్రవాకం, మొగలిరేకులు, కార్తీకదీపం వంటి సీరియల్స్.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకొని టీవీ చరిత్రలో టాప్ టిఆర్పిలను సొంతం చేసుకున్నాయి.

అసలు రీ రిలీజ్ కల్చర్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వచ్చింది గానీ, సీరియల్ ఇండస్ట్రీలో అయితే ఎప్పుడో వచ్చింది. చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ ని మళ్ళీ రీ టెలికాస్ట్ చేయండి అంటూ ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ లు రావడంతో వాటిని రీ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కి కూడా అదే డిమాండ్ ఉంది. అయితే మేకర్స్ దానిని రీ టెలికాస్ట్ కాకుండా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

Also read : Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకోన్? త్వరలో గుడ్ న్యూస్ అంటూ వార్తలు

కార్తీకదీపం మళ్ళీ మొదలవుతుంది అంటూ డాక్టర్ బాబు ఒక ప్రోమోని రిలీజ్ చేసారు. కొత్త వెలుగులతో కార్తీకదీపం సీరియల్ ని తీసుకు వస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ పేరుతో ఈ సీరియల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రోమో చూస్తుంటే.. కార్తీకదీపం మెయిన్ స్టోరీ లైన్‌ని తీసుకోని కొత్త నటీనటులు, కొత్త కథనంతో రూపొందబోతుందని తెలుస్తుంది.

ఇది చూస్తుంటే.. సీరియల్స్ లో కూడా సీక్వెల్ కల్చర్ స్టార్ట్ కాబోతుందా అనే సందేహం కలుగుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ లో సీరియల్ పై మంచి క్యూరియాసిటీ కనిపిస్తుంది. కొత్తగా వచ్చినా పర్వాలేదు, కానీ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత మాత్రం అలాగే ఉండాలని తమ డిమాండ్స్ చెబుతున్నారు. మరి ఈ సీరియల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)