×
Ad

Ray Stevenson : హాలీవుడ్ యాక్టర్, RRR నటుడు కన్నుమూత..

ప్రముఖ హాలీవుడ్ నటుడు, RRR సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైన రే స్టీవెన్ సన్(Ray Stevenson) మరణించారు.

  • Published On : May 23, 2023 / 07:23 AM IST

Hollywood Actor RRR Fame Ray Stevenson passes away

Ray Stevenson : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మధ్యాహ్నమే సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, RRR సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైన రే స్టీవెన్ సన్(Ray Stevenson) మరణించారు.

హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ 58 ఏళ్ళ వయసులోనే ఇటలీలో ఓ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిన్న మే 22 రాత్రి మరణించారు. RRR సినిమాలో బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో నటించి మెప్పించారు. క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ లో మరింత మెప్పించారు రే స్టీవెన్ సన్. RRR సినిమాతో ఇండియాలోనే కాక ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు.

Sarath Babu : శరత్ బాబు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు..

రే స్టీవెన్ సన్ పలు బ్రిటన్, హాలీవుడ్ సినిమాలలో నటించారు. థోర్, ట్రాన్స్‌పోర్టర్ సినిమాలతో రే స్టీవెన్ సన్ బాగా పాపులర్ అయ్యారు. ఆయన చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రే స్టీవెన్ సన్ మరణంతో RRR చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించారు. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు రే స్టీవెన్ సన్ కు నివాళులు అర్పిస్తున్నారు.