Mr Deyyam : ‘మిస్టర్ దెయ్యం’ సినిమా ఓపెనింగ్.. మంచు మనోజ్ గెస్ట్ గా హారర్ కామెడీ..

నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. (Mr Deyyam)

  • Published on- October 23, 2026 / 06:38 PM IST

Mr Deyyam

Mr Deyyam : శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ముఖ్య పాత్రల్లో సంజన అన్నే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్, అలీ, విజయ్ కనకమేడల, ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, విఎన్ ఆదిత్య, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి.. పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం దర్శకురాలు సంజన అన్నే మాట్లాడుతూ.. మా మిస్టర్ దెయ్యం సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ థాంక్స్. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది అని తెలిపారు. నటుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ.. మిస్టర్ దెయ్యం టైటిల్ బాగుంది. ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించబోతోన్నాను అన్నారు.

Also Read : Rajamouli : హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. వారణాసి అయ్యాక హాలీవుడ్ సినిమా.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. మిస్టర్ దెయ్యం అవుట్ అండ్ అవుట్ కామెడీ హారర్ సినిమాగా రానుంది. ఇప్పటివరకు చూడనటువంటి హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. హీరోయిన్ సిరి చౌదరి మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ చిత్రీకరణ ప్రారంభం కానుంది అని తెలిపారు.