Kalanki Bhairavudu : హారర్ థ్రిల్లర్ ‘కాళాంకి బైరవుడు’.. ఫస్ట్ లుక్ తోనే భయపెడుతున్నారుగా..

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కాళాంకి బైరవుడు సినిమా నుంచి నేడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

Kalanki Bhairavudu First Look Released by Rajashekar and Jeevitha

Kalanki Bhairavudu : రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కాళాంకి బైరవుడు’. శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి.. లాంటి సినిమాలు నిర్మించిన గాయత్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మాణంలో హరి హరన్.వి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కాళాంకి బైరవుడు సినిమా నుంచి నేడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. రాజశేఖర్, జీవిత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో హీరో కాగడా పట్టుకొని వెళ్తున్నట్టు ఉండగా చుట్టూ పుర్రెలు, వెనక పొట్టేలు ఉండి భయంకరంగా ఉంది. మరి పోస్టర్ లోనే ఈ రేంజ్ లో భయపెడుతున్నారు. సినిమాలో ఏ రేంజ్ లో భయపెడతారో చూడాలి.

Also Read : Nani : వాళ్ళు అలా కళ్ళు కప్పి తీసుకెళ్తున్నారు.. రాజమౌళి మహేష్ సినిమా లీక్స్ పై నాని కామెంట్స్..

ఇక ఈ కాలానికి భైరవుడు సినిమాలో ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Also Read : Nani – Chiranjeevi : నానికి సైకిల్ ఇచ్చిన చిరంజీవి.. ఇంటికెళ్తే బజ్జిలు వేయించి.. నాని మెగాస్టార్ ని షర్ట్ మార్చుకోమని చెప్తే..