Nani : వాళ్ళు అలా కళ్ళు కప్పి తీసుకెళ్తున్నారు.. రాజమౌళి మహేష్ సినిమా లీక్స్ పై నాని కామెంట్స్..
తాజాగా నాని ఈ సినిమా లీక్స్ పై స్పందించాడు.

Nani Comments on Rajamouli Mahesh Babu Movie Leaks
Nani : సినిమాల షూటింగ్ సమయంలోనే కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. కానీ రాజమౌళి సినిమాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆయన సినిమా షూటింగ్స్ నుంచి లీక్ అవ్వడం కష్టం. సెట్లోకి ఎవర్ని ఫోన్స్ తీసుకురానివ్వరు. కానీ రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ ఒడిశాలో జరిగినప్పుడు ఓ వీడియో, కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో మూవీ యూనిట్ వెంటనే అలర్ట్ అయింది.
తాజాగా నాని ఈ సినిమా లీక్స్ పై స్పందించాడు. నాని హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి – మహేష్ బాబు సినిమా లీక్స్ గురించి స్పందించారు.
Also Read : Imanvi : మా ఫ్యామిలీకి పాకిస్తాన్ కి సంబంధం లేదు.. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్..
నాని మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా అంటే వేలమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వందల మంది పనిచేస్తారు. అందర్నీ చూసుకోవాలి. ఆయన సినిమాల్లో షూటింగ్ ప్రదేశాలకు ఫోన్స్ అనుమతించరు. కానీ కొంతమంది మూవీ యూనిట్ కళ్ళు కప్పి ఫోన్స్ తీసుకెళ్తారు. ఫోన్స్ చెక్ చేసేటప్పుడు ఒక ఫోన్ చెకింగ్ సిబ్బందికి ఇచ్చి ఇంకో ఫోన్ ని సైలెంట్ గా తీసుకెళ్తారు. లీక్ చేయాలని భావించినప్పుడు చాలా అడ్డదారులు ఉంటాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు అవుతూనే ఉంటాయి. రాజమౌళి ఎంతో రహస్యంగా తెరకెక్కిద్దామనుకున్నా కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. కచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయాలి అని అన్నారు.
Also Read : Karthik Subbaraj : ‘గేమ్ ఛేంజర్’ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. నేనిచ్చిన కథని మార్చేశారు..