Imanvi : మా ఫ్యామిలీకి పాకిస్తాన్ కి సంబంధం లేదు.. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్..
ఇమాన్వి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.

Prabhas Fauji Heroine Imanvi Esmail gives Clarity on Her Nationality
Imanvi : ప్రభాస్ – హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ అమ్మాయి పాకిస్తాన్ అని, ఆమె తండ్రి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఉగ్రదాడి జరగడంతో పాకిస్తాన్ నటిని ఎందుకు తీసుకున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఆమెని దీనిపై స్పందించాలని సోషల్ మీడియా వేదికగా అడిగారు.
దీంతో ఇమాన్వి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
ఇమాన్వి తన పోస్ట్ లో.. నేను ఇలాంటి వైలెన్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా నివాళులు. నా ఐడెంటిటీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న దానిపై నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలిలో ఎవరూ పాకిస్తాన్ మిలటరీతో ఏ రకంగానూ సంబంధం లేదు. నా మీద ద్వేషం వ్యాప్తి చేయాలని ఇలాంటి ట్రోల్స్, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా సరిగ్గా పరిశోధించకుండా తప్పుడు ప్రచారం చేశారు.
నేను ఒక ఇండో అమెరికన్ ని. నేను హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ మాట్లాడతాను. నేను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. మా పేరెంట్స్ అధికారికంగా కాలిఫోర్నియాకు వాళ్ళు యువతగా ఉన్నప్పుడే వెళ్లిపోయారు. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయ్యారు. నా ఎడ్యుకేషన్ అంతా అమెరికాలోనే జరిగింది. నేను కొరియోగ్రాఫర్ గా పనిచేసాను. వాటి తర్వాత నాకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నాపై ప్రభావం చూపించింది. నా రక్తంలో లోతుగా ప్రవహిస్తున్న భారతీయ గుర్తింపు, సంస్కృతిని కలిగి ఉన్న వ్యక్తిగా ఈ మాధ్యమాన్ని విభజనకు బదులుగా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో మనం ప్రేమను వ్యాప్తి చేయాలి. చరిత్రలో కళలే అవగాహన కోసం ఉపయోగించారు. నా ఇండియన్ వారసత్వాన్ని, సంసృతిని వ్యాప్తి చేయడానికి నేను కష్టపడతాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో తనకు పాకిస్తాన్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను ఇండో అమెరికన్ అంటూ క్లారిటీ ఇచ్చింది ఇమాన్వి.