Karthik Subbaraj : ‘గేమ్ ఛేంజర్’ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. నేనిచ్చిన కథని మార్చేశారు..

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాపై తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్ చేసారు.

Karthik Subbaraj : ‘గేమ్ ఛేంజర్’ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. నేనిచ్చిన కథని మార్చేశారు..

Director Karthik Subbaraj Sensational Comments on Ram Charan Game Changer Movie

Updated On : April 24, 2025 / 10:18 AM IST

Karthik Subbaraj : స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా గత సంక్రాంతికి రిలీజయిన సంగతి తెలిసిందే. సినిమా యావరేజ్ గా ఉన్నా కొంతమంది హీరోల అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ సినిమాకి కావాలని నెగిటివ్ ప్రమోషన్స్ చేసి, సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని, సినిమా లీక్ చేసి భారీ నష్టాన్ని మిగిల్చారు. ఇది సైబర్ క్రైమ్ వరకు కూడా వెళ్ళింది.

అప్పట్నుంచి గేమ్ ఛేంజర్ గురించి ఎవరో ఒకరు ఏదో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాపై తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్ చేసారు. గేమ్ ఛేంజర్ సినిమాకు కథ ఇచ్చింది ఈయనే. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన సూర్య రెట్రో సినిమా మే 1న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : Nikhil – Kavya : ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందా? ఎవరి జీవితాలు వాళ్ళవి అంటూ నిఖిల్ పోస్ట్..

కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. నేను శంకర్ సర్ కి వన్ లైన్ స్టోరీ ఇచ్చాను. అది ఒక మంచి IAS ఆఫీసర్ కథ. కానీ తర్వాత అది ఒక డిఫరెంట్ ప్రపంచంలా మారింది. చాలా మంది రైటర్స్ వచ్చి కథని, స్క్రీన్ ప్లేని మార్చేశారు అని అన్నారు. దీంతో కార్తీక్ సుబ్బరాజు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై శంకర్ ఏమైనా స్పందిస్తాడో చూడాలి.