బాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లను పొగడ్తలతో ముంచెత్తాడు..
బాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ డ్యాన్సింగ్ స్టార్ హృతిక్ రోషన్.. కోలీవుడ్ దళపతి విజయ్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. హృతిక్ రోషన్ వెరీ గుడ్ డ్యాన్సర్ అని బాలీవుడ్ పరిశ్రమ, ప్రేక్షకులు చెబుతారు. మెలికలు తిరుగుతూ సిల్వర్ స్క్రీన్‌పై అతను చేసే డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి.
అలాంటి హృతిక్ రోషన్ కోలీవుడ్, టాలీవుడ్ హీరోల డ్యాన్స్ గురించి పొగడడం విశేషం. తాజాగా ఓ ప్రైవేట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం మంగళవారం (మార్చి 3) హృతిక్ చెన్నై వచ్చాడు. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. అభిమాన నటుడితో ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఉత్సాహం కనబర్చారు. ఆ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో హృతిక్ రోషన్ దక్షిణాది సినిమాల్లో టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారని చెప్పాడు. తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు.
డ్యాన్స్ చేయడానికి ఎంతో ప్రాక్టీస్, డెడికేషన్ కావాలి.. మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మన ఫేస్‌లో ఆ ఫీలింగ్స్ కనబడతాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ ఎనర్జిటిక్ మరియు స్ఫూర్తిదాయకం. అలాగే విజయ్ కూడా ఫెంటాస్టిక్ డ్యాన్సర్. నాకు తెలిసి వీరు రహస్యంగా ఏదో తింటున్నారు. లేకపోతే రోజూ అదే ఎనర్జీతో పనిచేయడం అనేది చాలా కష్టం. డ్యాన్స్‌కు ముందు ఈ స్టార్స్ తీసుకునే ప్రత్యేక డైట్ ఏంటో తెలుసుకోవాలి’ అని హృతిక్ అన్నాడు. హృతిక్ రోషన్.. విజయ్, అల్లు అర్జున్ గురించి మాట్లాడిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. (వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్ – ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్..)
Bollywood Super Star @iHrithik About
Stylish Star of Indian Cinema @alluarjun
‘s dance ??#AA20 #AlaVaikunthapurramuloo @SKNonline @AlluSirish@imsarathchandra @AlluSirish@TrendsAlluArjun@AlluArjunHCF#TeamAAYW @AAYWOnline @ratankmr6 pic.twitter.com/1Vjp22zDVX— AlluArjun Yuvatha Warangal (@AAYWOnline) March 3, 2020