ఎన్నారై అభిమాని యాత్ర ప్రీమియర్ టికెట్‌ని, ఏకంగా 4.37 లక్షలు పెట్టి కొన్నాడు.
వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా, మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, యాత్ర. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, ట్రైలర్ అండ్ ఆడియో సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 7న యూఎస్‌లో భారీగా యాత్ర ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రీమియర్ షో చూడడానికి ఒకవ్యక్తి అక్షరాలా లక్షలు ఖర్చు చెయ్యడం హాట్ టాపిక్‌గా మారింది. మునీశ్వర్ రెడ్డి అనే వైఎస్సార్.. ఎన్నారై అభిమాని యాత్ర ప్రీమియర్ టికెట్‌ని, ఏకంగా 4.37 లక్షలు పెట్టి కొన్నాడు. నార్మల్‌గా యూఎస్‌లో టికెట్ రేటు 12 డాలర్లు ఉంటుంది.
వైఎస్‌పై అభిమానంతో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు వేలం పాటలో యాత్ర ప్రీమియర్ షో టికెట్‌ని దక్కించుకున్నాడు. నిర్మాతలు ఈ డబ్బుని వైఎస్సార్ చారిటీకి అందజెయ్యనున్నారని తెలుస్తుంది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం భాషల్లోనూ యాత్ర రిలీజ్ కానుంది. జగపతి బాబు, అశ్రిత, సుధీర్ బాబు, నాగినీడు, సచిన్ కేద్కర్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.