Ameerlog Trailer : ‘అమీర్‌ లోగ్’ ట్రైలర్ చూశారా..? హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో..

మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Ameerlog Trailer)

  • Published on- August 14, 2026 / 05:36 PM IST

Ameerlog Trailer

Ameerlog Trailer : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.

రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాని ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..

Also Read : Makutam Review: ‘మకుటం’ మూవీ రివ్యూ.. విశాల్ రెండు పాత్రల్లో మెప్పించాడా?

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గెస్ట్ గా హాజరయిన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. ఈ సినిమా సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చింది. హరి నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా రియలిస్టిక్‌గా, రాగా అనిపిస్తుంది అని అన్నారు. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఈ సినిమాకు అతనిచ్చిన మ్యూజిక్ బాగుంది అని అన్నారు.

దర్శకుడు రమణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుంది. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది అని తెలిపారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. మా అమీర్ లోగ్ సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

నటుడు ఎంసి హరి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంత స్పెషలో.. నాకు ఈ సినిమా అంత స్పెషల్. ఈ మూవీతో మా ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులు పరిచయం కాబోతోన్నారు. మా నాన్న కూడా ఈ సినిమాలో నటించారు. నేను బస్తీలో పుట్టి పెరిగాను. ఇప్పుడు ఓ బస్తీ సినిమాతోనే వస్తున్నాను అని తెలిపాడు.