×
Ad

Hyper Aadi : హరిహర వీరమల్లు కోసం వర్క్ చేస్తున్నాను.. పవన్‌కి డబ్బంటే ఆసక్తి లేదు..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ''పవన్‌కల్యాణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి నేను........

  • Published On : July 12, 2022 / 08:35 AM IST

Pawan Kalyn

Pawan Kalyan :  ఒకపక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో పవన్ బిజీబిజీగా ఉన్నారు. పవన్ కి ఉన్న ఫ్యాన్స్, ఆయన రేంజ్ గురించి తెలిసిందే. పవన్ గురించి తెలిసిన వాళ్ళు, పవన్ తో కలిసి పని చేసే వాళ్ళు ఆయన గురించి గొప్పగా చెప్తుంటారు. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది కూడా గతంలో చాలా సార్లు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ అనేక సందర్భాల్లో పవన్ ని పొగిడాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పాడు హైపర్ ఆది.

Sai Pallavi : వేరే హీరోయిన్ ఈ సినిమాని నాకు ఇచ్చింది.. నటిగా నిరూపించుకోవడానికే ఇలాంటి పాత్రలు..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ”పవన్‌కల్యాణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి నేను వర్క్‌ చేస్తున్నా. ఆ వర్క్ మీదే ఇటీవలే నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పర్సనల్‌గా కలిసాను. ఆయనెంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైంది. మనందరికీ డబ్బు కావాలి. డబ్బు ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే చూస్తాడు. సినిమాల నుంచి వచ్చిన సొమ్ముని కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తే ఆ మొత్తం పేదలకు సాయం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కోసం పనిచేస్తోన్న వారికే ఇచ్చేస్తారు. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటాను” అని తెలిపారు.