Hyper Aadi Re-Entry: జబర్దస్త్ ఫ్యాన్స్ కి పండగే.. హైపర్ ఆది కూడా రీ ఎంట్రీ.. ఎప్పుడంటే..?
అదిరే అభి స్కిట్స్ లో ఒక చిన్న ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది ఆ తర్వాత హైపర్ ఆది గా టీమ్ లీడర్ అయ్యాడు. (Hyper Aadi)
- Saketh U
- Updated on- May 18, 2026 / 06:17 PM IST
Hyper Aadi Jabardasth Re Entry Promo Goes Viral
Hyper Aadi Jabardasth: జబర్దస్త్ టీవీ షో ఎంతోమంది కమెడియన్స్ ని స్టార్స్ ని చేసింది. ఈ షో చేసి పాపులారిటీ సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ షో ఇచ్చిన ఫేమ్ తో చాలా మంది సినిమాల్లోకి కమెడియన్స్ గా, రైటర్లుగా, డైరెక్టర్స్ గా వెళ్లిపోయారు. అలాంటి స్టార్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు.
అదిరే అభి స్కిట్స్ లో ఒక చిన్న ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది ఆ తర్వాత హైపర్ ఆది గా టీమ్ లీడర్ అయ్యాడు. తన స్కిట్స్ తో ఫుల్ గా నవ్వించిన హైపర్ ఆది ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవ్వడం, జబర్దస్త్ కి కొత్తవాళ్లను తీసుకురావడంతో ఆది జబర్దస్త్ మానేసాడు. ప్రస్తుతం ఆది సినిమాలు చేస్తూనే మరో పక్క ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నాడు.
Also Read – Peddi : తాపీమేస్త్రి ‘పెద్దిరాజు’ కథే పెద్ది సినిమానా..? బుచ్చిబాబు ఏం చెప్పాడంటే..
జబర్దస్త్ లో ఇటీవలే పాత వాళ్ళు మళ్ళీ రావడం మొదలుపెట్టారు. నాగబాబు కూడా జడ్జిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు స్కిట్స్ బాగుంటున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది కనిపించాడు. షోకి గెస్ట్ గా వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి ఎప్పుడు వస్తావు అని అడగడంతో ఆది స్పందిస్తూ.. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళతో కాంబినేషన్ సెట్ చేసుకొని జూన్ నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను అని తెలిపాడు.
దీంతో హైపర్ ఆది కూడా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. రైజింగ్ రాజు, అజార్, దొరబాబు.. ఇలా తన పాత టీమ్ ని మళ్ళీ ఫామ్ చేసి ఆది రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. ఆది రీ ఎంట్రీ ఇస్తే జబర్దస్త్ కి మరింత రేటింగ్ పెరిగే అవకాశం ఉంది.
