Hyper Aadi : మీ కష్టం పగవాడికి కూడా రాకుడదు.. నాగబాబుపై ఆది కామెంట్స్.. పాపం బాబు అంత కష్టపడుతున్నారా?

హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కి వచ్చి కొన్ని పంచులు వేశారు. ఈ క్రమంలో నాగబాబుపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. (Hyper Aadi)

  • Published on- July 28, 2026 / 07:01 PM IST

Hyper Aadi

Hyper Aadi : ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా నాగబాబు షోని ముందుండి నడిపించారు. ఆ షో హిట్ అవ్వడానికి ఆయన కూడా ఒక కారణం. మధ్యలో పలు కారణాలతో దూరమైనా నాగబాబు ఇటీవల కొన్నాళ్ల క్రితం మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చారు. ఆయన వచ్చినప్పట్నుంచి మళ్ళీ జబర్దస్త్ కాస్తో కూస్తో బాగుంటుంది. ఎందుకంటే స్కిట్స్ సెలెక్షన్, స్కిట్ చేసే పాయింట్స్ అన్ని ఆయనే ఇస్తున్నారట. టీమ్ లీడర్స్ కి సలహాలు ఇస్తున్నారట. అంతే కాకుండా స్కిట్స్ బాగా రావాలని బెస్ట్ పంచ్, బెస్ట్ స్కిట్, బెస్ట్ పర్ఫార్మర్ అంటూ ప్రకటిస్తూ తన సొంత డబ్బులు ఇస్తున్నారు నాగబాబు.

తాజాగా హైపర్ ఆది ఓ స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చాడు. జబర్దస్త్ తోనే ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ కి దూరమయి కమెడియన్ గా, రచయితగా చాలా బిజీగా ఉన్నారు. సినిమాలతో, వేరే టీవీ షోలతో బిజీగా ఉన్న హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కి వచ్చి కొన్ని పంచులు వేశారు. ఈ క్రమంలో నాగబాబుపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : Chennai Love Story : తెలుగులో ఛానల్ లేదు.. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ శాటిలైట్ రైట్స్ కొన్న సంస్థ..

హైపర్ ఆది మాట్లాడుతూ.. రాజకీయాల్లో బోల్డన్ని టెన్షన్స్ పెట్టుకొని ఇక్కడకు మీరొస్తే ఇక్కడ కూడా వాళ్ళు కామెడీ పేరు చెప్పి మిమ్మల్ని దాని కంటే ఎక్కువ టెన్షన్ పెడుతున్నారు. అయినా కూడా నవ్వుతూ ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. గ్రూప్ అందర్నీ కూర్చోపెట్టి చెప్పినా, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి చెప్పినా చెప్పిన విషయాన్ని కామెడీగా తీసుకుంటున్నారు కానీ చెప్పిన విషయంలో నుంచి కామెడీ తీసుకు రావట్లేదు. మీ బాధ నాకు అర్థమైంది. మీరే సలహాలిచ్చి, మీరే సిగ్మెంట్స్ ఇచ్చి, మీరే లైన్స్ ఇచ్చినా చివరకు వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సర్ అని అన్నారు.

అలాగే.. ఇక్కడ బెస్ట్ పంచ్ వేస్తే వెయ్యి రూపాయలు, పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి ఐదువేలు, ఎక్కువ స్కిట్స్ కొడితే యాభైవేలు, ఇంకా ఎక్కువ కొడితే లక్ష అని ఆషాడం ఆఫర్స్ పెట్టారు అంటగా. అయినా డబ్బులు తీసుకొని నవ్వుకొని వెళ్లే మీరు డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా? ఓటుకు నోటు క్షమించని మీరు ఇక్కడ స్కిట్ కి నోటు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారా? ఏదేమైనా ఇలా డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం పేదవాళ్ళు మాత్రం అవ్వకండి సర్ అంటూ నాగబాబుకి సలహాలు ఇచ్చాడు ఆది. దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాగబాబు జబర్దస్త్ కోసం ఇంత కష్టపడుతున్నారా అని అనుకుంటున్నారు.