‘ఐకాన్’ కనబడుటలేదు.. కానీ ఆగిపోలేదు..
అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన ‘ఐకాన్’ మూవీ టీమ్..
- sekhar
- Published on- April 8, 2020 / 01:17 PM IST
అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన ‘ఐకాన్’ మూవీ టీమ్..
గతేడాది అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ‘ఐకాన్- కనబడుటలేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఓ మైండ్ ఫ్రెండ్’, ‘ఎమ్సీఏ’ సినిమాలతో ఆకట్టుకున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలియచేస్తూ.. బన్నీ త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాల అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుందని, బన్నీ నటించే 21వ చిత్రంగా దీనిని ప్రకటించారు.
కట్ చేస్తే ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం నుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్ హీరోగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ‘ఐకాన్’ ఆగిపోయింది అనుకున్నారంతా. అయితే సరిగ్గా ఏడాదికి అంటే.. ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ చూస్తే ‘ఐకాన్’ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
Read Also : సమాధిని ప్రపంచ వింతగా చూడాలా? కొత్త కాంట్రవర్సీలో కంగనా చెల్లి
మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతేడాది ఏ పోస్టర్ అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్టర్‌ను పోస్ట్ చేశారు. కాగా, ‘ఐకాన్’లో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలను త్వరలో తెలియనున్నాయి.
