Allu Arjun : పెద్ది మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా..
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీపై అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసల వర్షం కురిపించారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 9, 2026 / 12:32 PM IST
Icon star allu arjun review on Peddi movie
Allu Arjun : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే 292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా రామ్‌చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ది మూవీ, రామ్‌చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
నిన్న రాత్రి పెద్ది మూవీని చూసిన అల్లు అర్జున్ ఈ ఉదయం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రామ్‌చరణ్ బాడీ ట్రాన్స్‌పర్మేషన్ చూసి ఆశ్చర్యపోయినట్లుగా చెప్పుకొచ్చారు. చరణ్ తన నటనతో అదరగొట్టేశాడని తెలిపారు.. చరణ్ ను చూస్తుంటే గర్వంగా ఉందని, అతడికి వస్తున్న ప్రశంసలు అన్ని అతడు పడిన కష్టానికి ప్రతిఫలమేనని బన్నీ తెలిపారు.
Slum Dog Teaser Launch Event : స్లమ్ డాగ్ టీజర్ లాంఛ్ ఈవెంట్ ఫోటోలు..
‘నిన్న రాత్రి పెద్ది మూవీని చూశాను. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్‌పర్మేషన్, నటన, అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించారు. నా సోదరుడిని చూసి నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రశంసలు అన్నింటికి చరణ్ నిజమైన అర్హుడే. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు అందరూ కూడా అద్భుతమైన నటన కనబరిచారు. జాన్వీకపూర్‌కు ప్రేమపూర్వక అభినందనలు. ఇక చరణ్‌ను అత్యున్నత స్థానంలో నిలిపిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు.’ అని అల్లు అర్జున్ అన్నారు.
