తెలుగు రాష్ట్రాల్లో కూల్ క్లైమేట్… సెగలు పంచుతున్న ఇలియానా హీట్

ఇలియానా కళ్లను చూస్తే టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ దేవదాస్‌లో ఫ్రెష్ అందాలే గుర్తుకొస్తాయి. తెలుగు సినిమాలకు ఇంతకాలం గ్యాప్ ఇచ్చినా సౌత్ ఇండస్ట్రీలో అదే హవా నడిపిస్తోంది. ఇల్లీ బెల్లీ డ్యాన్స్ కు ఫిదా కానీ అభిమానుల్లేరు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో ఒకటే క్రేజ్ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. వన్నె తగ్గని వయ్యారాలను కొత్తగా చూపిస్తూ కిర్రెక్కిస్తుందీ యానా.

సినిమాల మాట అటుంచి సోషల్ మీడియాలో అభిమానులకు మరింత దగ్గరగా ఉంటుంది. ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపించినా కళ్లకు ఉన్న మ్యాజిక్ తో అంతే అట్రాక్షన్ మెయింటైన్ చేస్తుంది. స్విమ్మింగ్ సూట్ వేసుకుని నీటి అడుగున ఈదుతూ ఓ వీడియో తీసి పోస్టు చేసిన వీడియో కెవ్వు కేక అంటుంటే.. మరోసారి సన్ కిస్ అంటూ కళ్లద్దాలు పెట్టుకుని ఎండలో మెరిసిపోతూ కనిపించింది.

సన్ తో సావాసం చేస్తున్నా.. ఎండ గురించి ఏం భయంలేదని అంటోంది ఇలియానా. ఈ పోస్టుకు 4లక్షల మంది హార్ట్ ఇచ్చేశారు. మరి ఈ బాలీ-టాలీవుడ్ హీరోయిన్ కు మీదెన్నో హార్టో లైక్ కొట్టి చూసుకోండి మరి.

కొద్ది నెలలుగా ఓ ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ అఫీషియల్‌గా చెప్పేసిన ఇలియానాను మరింత అందంగా ఫొటోల్లో చూపించడానికి అతనే కారణం కాబోలు.