I’m Handsome : ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ ట్రైలర్ చూశారా..?
మీరు కూడా ‘ఐ యామ్ హ్యాండ్సమ్' ట్రైలర్ చూసేయండి.. ( I'm Handsome)
- Saketh U
- Updated on- June 9, 2026 / 06:05 PM IST
I'm Handsome
I’m Handsome : దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ఐ యామ్ హ్యాండ్సమ్. K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అన్విష హీరోయిన్ గా నటిస్తుండగా కిట్టయ్య, కేడర్ శంకర్, రూప కళ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా జూన్ 12 రిలీజ్ కానుంది.
మీరు కూడా ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ ట్రైలర్ చూసేయండి..
Also Read : Sneha Meets CM Vijay : ఫ్యామిలీతో సీఎం విజయ్‌ని కలిసిన స్నేహ.. విజయ్ ని హత్తుకున్న స్నేహ కూతురు.. ఫొటోలు..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు చేపట్టి సినిమా తెరకెక్కించడం అభినందనీయం అన్నారు. దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ.. ఏలూరులో మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. ఇవాళ నేను ఇక్కడ నిలబడటం ఆనందంగా ఉంది. అందుకే నాకు నేనే స్టార్. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఇది నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని అన్నారు.
నిర్మాత కేదార్‌నాథ్ మాట్లాడుతూ.. తండ్రి-కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా మంచి సినిమా తీసాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి 45 నిముషాలు భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కానుంది అని తెలిపారు.
