×
Ad

Ayodhya Ram Mandir : అయోధ్యలో సినీ సెలబ్రిటీలు.. చిరు, పవన్, రజిని, అమితాబ్, చరణ్.. రామయ్య సేవలో..

అన్ని సినీ పరిశ్రమలలోని పలువురు స్టార్స్ కు కూడా అయోధ్య ఆహ్వానం అందింది. దీంతో నేడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు.

  • Published On : January 22, 2024 / 10:59 AM IST

Indian Film Celebrities Chiranjeevi Ram Charan Rajinikanth Amitab Kangana and so many Celebrities Arrived to Ayodhya Ram Mandir Opening Ceremony

Ayodhya Ram Mandir : దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నేడు ప్రారంభం కానుంది. నేడు మధ్యాహ్నం రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అందరు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది ఆలయ ట్రస్ట్. ఈ నేపథ్యంలో అన్ని సినీ పరిశ్రమలలోని పలువురు స్టార్స్ కు కూడా అయోధ్య ఆహ్వానం అందింది. దీంతో నేడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు.

ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్.. ఇలా అనేకమంది ప్రముఖులు వచ్చారు. వీరంతా అయోధ్య రామమందిరం వద్ద సందడి చేస్తున్నారు. ఇక అయోధ్యకు భారీగా సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రావడంతో ఇప్పటికే అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దాదాపు 100 ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు చేరుకున్నాయి.

పలువురు ప్రముఖులు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామమందిరంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.