Uday Kiran : ఇంద్ర సినిమాలో నటించిన నటి.. ఉదయ్ కిరణ్ మూవీలో హీరోయిన్‌గా చేయాల్సింది.. కానీ..
చిరంజీవి ఇంద్ర సినిమాలో నటించిన నటిని ఉదయ్ కిరణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను కాదని వేరే నటిని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? అసలేమైంది..?
- gum 95921
- Published On : April 4, 2024 / 04:52 PM IST
Indra movie actress Prashanthi Harathi is first choice for Uday Kiran Nuvvu Nenu heroine
Uday Kiran : ‘చిత్రం’ సినిమాతో ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తేజ్.. ఆ తరువాత ‘నువ్వు నేను’ సినిమాతో కూడా సూపర్ హిట్ ఇచ్చి హీరోగా నిలబెట్టారు. ఈ సినిమాలో అనిత హీరోయిన్ గా నటించారు. అయితే ముందుగా ఈ పాత్రకి అనితని ఎంపిక చేసుకోలేదట. చిరంజీవి ఇంద్ర సినిమాలో నటించిన నటిని ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను కాదని అనితని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? అసలేమైంది..?
ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, రూపాయి, ఇంద్ర, పెళ్ళాం ఊరెళితే.. వంటి సినిమాల్లో నటించిన గుర్తింపు సంపాదించుకున్న నటి ‘ప్రశాంతి హారతి’. ఇంద్ర సినిమాలో షౌకత్ అలీ ఖాన్ పాత్రకి కూతురిగా ప్రశాంతి నటించారు. ఆ తరువాత ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో సునీల్ పాత్రకి భార్యగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందే ప్రశాంతి హారతి.. ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్ గా చేయాల్సిందట.
Also read : Save The Tigers 2 : ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.. మూడో సీజన్‌కి ముహూర్తం..
ఆ సినిమా కోసం దర్శకుడు తేజకి ఆడిషన్ కూడా ఇచ్చారట. ప్రశాంతికి మొత్తం కథ కూడా వినిపించారట. కానీ తరువాత ఆ పాత్రకి ఆమె సెట్ అవ్వదని తొలిగించారట. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర.. పాలు అమ్ముకునే కూతురు. కానీ ప్రశాంతి ఫేస్ లో కొంచెం రిచ్‌నెస్ కనిపిస్తుందని, అందుకనే ఆమెను వద్దని అనితని తీసుకున్నారట. దీంతో ప్రశాంతికి హీరోయిన్ ఛాన్స్ మిస్ అయ్యింది.
కాగా ప్రశాంతి హారతి మంచి క్లాసికల్ డాన్సర్. నటన పై కూడా మంచి పట్టు ఉంది. ఇంద్ర, పెళ్ళాం ఊరెళితే సినిమాలు తరువాత మంచి అవకాశాలే అందుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడంతో.. యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. మళ్ళీ ఇటీవలే తిరిగి వెనక్కి వచ్చారు. ఈక్రమంలోనే ఇటీవల VN ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగింటి సంస్కృతి మ్యూజిక్ వీడియోలో నటించారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారు.
