Save The Tigers 2 : ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.. మూడో సీజన్‌కి ముహూర్తం..

తెలుగు సినిమాలు మాత్రమే కాదు తెలుగు వెబ్ సిరీస్ కూడా నేషనల్ వైడ్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.

Save The Tigers 2 : ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.. మూడో సీజన్‌కి ముహూర్తం..

Mahi V Raghav about Save The Tigers 2 success and season 3 update

Updated On : April 4, 2024 / 4:14 PM IST

Save The Tigers 2 : ప్రస్తుతం నేషనల్ వైడ్ లో తెలుగు సినిమాలు మాత్రమే కాదు తెలుగు వెబ్ సిరీస్ కూడా అదుర్స్ అనిపిస్తున్నాయి. రీసెంట్ గా తెలుగులో రిలీజైన్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 సూపర్ హిట్ స్ట్రీమింగ్ ని అందుకొని రికార్డులు సృష్టిస్తుంది. యాత్ర ఫేమ్ మహి వి.రాఘవ్ రచయితగా, షో రన్నర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూ తీసుకు వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ గత ఏడాది రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది.

దీంతో ఇటీవల ఈ సిరీస్ సెకండ్ సీజన్ ని తీసుకు వచ్చారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సీజన్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు యూత్ నుంచి కూడా ఈ సిరీస్ కి మంచి స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో అదిరిపోయే స్ట్రీమింగ్ ని అందుకుంది. కేవలం సౌత్ ఇండియా స్టేట్స్ లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also read : Vijay Deverakonda : నా లవ్ స్టోరీ కంటే.. సుధీర్ రష్మీల లవ్ స్టోరీ ఫేమస్..

ఇండియన్ టాప్ వెబ్ సిరీస్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మూడో స్థానంలో నిలిచి తెలుగు వెస్ సిరీస్ సత్తాని చాటుతుంది. ఇక ఈ సిరీస్ టాప్ 3లో నిలవడం పై షో రన్నర్ మహి వి.రాఘవ్ సంతోషం వ్యక్తం చేసారు. వెబ్ సిరీస్ లో ఒక సీజన్ బాగా క్లిక్ అయితే మరో సీజన్ అంతగా క్లిక్ అవ్వదు. కానీ ఈ సిరీస్ రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడం సాధారణమైన విషయం కాదని మహి వి.రాఘవ్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సిరీస్ ని ఇంతటి హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే మూడో సీజన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి సీజన్ 3 షూటింగ్ సెట్స్ పైకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇక అలాగే ఎవరైనా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌, ఔత్సాహిక రచయితలు ఉంటే.. వారి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ కోరారు.