Vijay Deverakonda : నా లవ్ స్టోరీ కంటే.. సుధీర్ రష్మీల లవ్ స్టోరీ ఫేమస్..

నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ నిత్యం వార్తల్లో ఉంటుంది. నాకంటే సీనియర్ నువ్వు అంటూ సుడిగాలి సుధీర్ కి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda : నా లవ్ స్టోరీ కంటే.. సుధీర్ రష్మీల లవ్ స్టోరీ ఫేమస్..

Vijay Deverakonda comments about sudigali sudheer rashmi gautam love story

Updated On : April 4, 2024 / 3:34 PM IST

Vijay Deverakonda : టాలీవుడ్ లో కొన్ని లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఆన్ స్క్రీన్ పై లవర్స్ గా ఆకట్టుకున్న జంట రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే చూడాలని ఆడియన్స్ ఆశపడుతుంటారు. ఈక్రమంలోనే ఆయా జంటలకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలా టాలీవుడ్ బాగా ఫేమస్ అయిన రెండు లవ్ స్టోరీస్.. సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ గౌతమ్, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న.

ఈ రెండు లవ్ స్టోరీస్ కి టాలీవుడ్ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆన్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్న ఈ లవ్ స్టోరీస్.. రియల్ లైఫ్ లో నిజామా లేదా అనేది మాత్రం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే ఉండిపోయింది. తాజాగా ఈ రెండు లవ్ స్టోరీస్ లోని వ్యక్తులు ఓ వేదిక పై కలుసుకున్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో హీరోగా చేయాలంటూ టీవీ షోలకు దూరంగా ఉన్న సుడిగాలి సుధీర్.. ఈ ఉగాది స్పెషల్ షోతో మళ్ళీ బుల్లితెర ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

ఇక ఈ షోకి ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో సుధీర్, విజయ్ తో మాట్లాడుతూ.. ‘పెళ్లికాని యువతికి ఏమైనా టిప్స్ ఇవ్వండి’ అని అడిగారు. దానికి విజయ్ బదులిస్తూ.. “నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ నిత్యం వార్తల్లో ఉంటుంది. నాకంటే సీనియర్ నువ్వు. నీకు నేను ఇచ్చేది ఏంటి” అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.