ట్విట్టర్‌లో ఆర్ఆర్ఆర్ అప్‌డేట్: న్యూ ఇయర్‌కి ఇంట్రెస్టింగ్ పోస్టర్?
- vamsi
- Published On : December 31, 2019 / 05:10 AM IST
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ అయినా వస్తుందని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు నందమూరి, మెగా అభిమానులు. బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న కావడంతో ఆర్ఆర్ఆర్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.
సినిమాకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతూ షూటింగ్ చేస్తుంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70శాతం మేర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ గాని, సినిమా టైటిల్ గాని రిలీజ్ చేయలేదు. అయితే కొత్త సంవత్సరంలో సినిమా ప్రమోషన్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సంధర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోట్లేదు అభిమానులు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ నిర్మాతలపై సెటైర్లు వేస్తున్నారు అభిమానులు. లేటెస్ట్‌గా న్యూ ఇయర్‌కి పోస్టర్ వదులుతారని, అయితే అది న్యూ ఇయర్ విషెస్ పోస్టర్ అని ఓ అభిమాని పాత విషెస్ పోస్టర్లను చేసి పెట్టాడు. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా 2020కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చేద్ధాం.. మేము దానిపై పని చేస్తున్నాము అంటూ పోస్ట్ చేసింది. ఈ కామెంట్‌తో న్యూ ఇయర్‌కి యూనిట్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఉంటుందేమో? అని భావిస్తున్నారు. YearOfRRR, HappyRRRYear అనే హ్యష్ ట్యాగ్‌లను పోస్ట్‌కు జతచేశారు.
?Yes… We are working on it ??
Okay, let’s give your fandom a blasting start to 2020 with a # trend tomorrow!
What will it be?#YearOfRRR or #HappyRRRYear https://t.co/wAppKMwfqu
— RRR Movie (@RRRMovie) December 31, 2019
