నిహారిక కొణిదెల నిర్మాతగా, మహేష్ ఉప్పల దర్శకత్వంలో.. తెలుగులో ఫస్ట్ టైమ్ 100 ఎపిసోడ్‌లతో కామెడీ హైలెట్‌గా రూపొందుతున్న ‘మ్యాడ్ హౌస్’ వెబ్ సిరీస్ అక్టోబర్‌లో ప్రసారం కానుంది..
నిహారిక కొణిదెల నిర్మాతగా మరో వెబ్ సిరీస్ చెయ్యబోతుంది. ‘ముద్దపప్పు ఆవకాయ’తో వెబ్ సిరీస్‌లోకి అడుగు పెట్టింది నిహారిక.. ఈ వెబ్ సిరీస్‌కి మంచి ఆదరణ లభించడంతో తండ్రి నాగబాబుతో కలిసి ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ చేసింది. మధ్యలో ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి సినిమాల్లో నటించింది.. ‘సైరా నరసింహారెడ్డి’లో కీలక పాత్ర చేసింది.
కొంత గ్యాప్ తర్వాత ‘మ్యాడ్ హౌస్’ పేరుతో కామెడీ వెబ్ సిరీస్ రూపొందిస్తుంది. తెలుగులో ఫస్ట్ టైమ్ 100 ఎపిసోడ్‌లతో కామెడీ హైలెట్‌గా ఈ సిరీస్ ఉండబోతుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక నిర్మిస్తున్న మ్యాడ్ హౌస్ సిరీస్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో రీసెంట్‌గా విడుదలైంది.
Read Also : సితార పాపకి డాటర్స్ డే శుభాకాంక్షలు..
ఈ వీడియోలో.. సిరీస్ ఎలా ఉండబోతుందనేది చెప్పారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల మధ్య ఫన్నీగా ఉండే ఈ సిరీస్.. యూత్ ఆడియన్స్‌ని మెప్పించేలా ఉంది. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో రకంగా కథ ఉండబోతుందట. అక్టోబర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. మహేష్ ఉప్పల డైరెక్ట్ చేశాడు.