Anchor Sowmya : యాక్సిడెంట్ అయినా, రక్తం కారుతున్నా యాంకరింగ్ చేయడానికి వెళ్లిన యాంకర్..
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌమ్య తన లైఫ్ లో కష్టాలన్నీ చెప్పుకొచ్చింది.

Anchor Sowmya
Anchor Sowmya : పలు కన్నడ, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య కన్నడలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం ఇక్కడకు వచ్చింది. ఇక్కడ జబర్దస్త్ లో, పలు టీవీ షోలలో కూడా యాంకర్ గా చేసింది. ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌమ్య తన లైఫ్ లో కష్టాలన్నీ చెప్పుకొచ్చింది.
సౌమ్య మాట్లాడుతూ.. నేను కాలేజీ రోజుల నుంచే పార్ట్ టైం చేసేదాన్ని. అలా చేస్తున్నప్పుడు ఓ రోజు ఒక పెద్ద కన్నడ హీరోని ఇంటర్వ్యూ చేయాలి. వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. లెగ్ అంతా దెబ్బ తగిలింది. రక్తం కారుతుంది. రోడ్ మీద అందరూ హాస్పిటల్ కి వెళ్లమన్నారు. కానీ నేను యాంకరింగ్ చేయడానికి వెళ్ళాను ఆ డబ్బులు ఎక్కడ పోతాయో అని. కాలికి కట్టు కట్టుకొని హీరో ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. నేను వెళ్లకపోతే ఇంకొకరిని మాట్లాడుకుంటారేమో నా డబ్బులు పోతాయి, ఆ డబ్బులు అవసరం అని నా బాధ. అక్కడికి వెళ్తే నా కాలు చూసి పర్లేదు హాస్పిటల్ కి వెళ్లమన్నారు అని తెలిపింది.
Also Read : Sowmya : ఫ్లైట్ లో యాంకర్ ఫోన్ నెంబర్ అడిగిన పెద్ద హీరో.. ఆ మ్యాటర్ బయటపెట్టొద్దు అంటూ..