Fans Meet : అల్లు అర్జున్‌ను ఫాలో కానున్న మిగిలిన హీరోలు.. ఫ్యాన్స్ మీట్?
ఇటీవల ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పెట్టిన ఫ్యాన్స్ మీట్ (Fans Meet )అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- July 30, 2026 / 10:16 AM IST
Is all heroes doing fans meets just like Allu Arjun
Fans Meet : ఇటీవల ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పెట్టిన ఫ్యాన్స్ మీట్ అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి, వాళ్లతో సరదాగా గడపటం, లంచ్ ఏర్పాటు చేయటం, ఫోటోలు దిగటం మాత్రమే కాదు..ఎంతో సింపుల్‌గా, దగ్గరగా మెలగటం ఆకట్టుకుంది.
ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా తమ హీరోలు ఎప్పుడు ఇలా ఫ్యాన్స్ మీట్ పెడతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు అయితే తమ అభిమాన హీరోలను ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో ఈ స్థాయిలో కనెక్ట్ అవ్వటంతో హీరోకి వచ్చే పాజిటివ్ ఇమేజ్ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.
Manjula : జలకన్యగా డాక్టర్ బాబు భార్య.. మంజుల ఫోటోలు వైరల్..
అల్లుఅర్జున్ ఈ మీట్‌ను కేవలం తెలుగు రాష్ట్రాల అభిమానులకు పరిమితం చేయకుండా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ బెల్ట్ ఫ్యాన్స్‌ను కూడా కలుపుకొని గ్రాండ్‌గా నిర్వహించారు. కొంతమంది అభిమానులకు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సపోర్ట్ ఇవ్వటం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో తమ హీరోలు కూడా ఇలా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్టులు చేస్తున్నారు.
ఈ ఒక్క మీట్‌తోనే అల్లుఅర్జున్ ఫ్యాన్ కనెక్ట్‌కు కొత్త స్టాండర్డ్ సెట్ చేశారని అంటున్నారు, మిగతా స్టార్స్ కూడా అభిమానులతో ఫ్యాన్స్ మీట్స్ పెడితే..వాళ్ల స్థాయి నెక్స్ట్ లెవెల్‌కు చేరడమే కాదు..ఆడియన్స్‌లోనూ హీరోలపై పాజిటివ్ ఓపీనియన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు.నెక్స్ట్ ఏ హీరో ఫ్యాన్ మీట్ పెట్టబోతున్నారో..అల్లుఅర్జున్ సెట్ చేసిన ట్రెండ్ ఫాలో అయ్యే స్టార్స్ ఎవరో చూడాలి మరి.
