RC17 : డీఎస్పీ ఔట్.. అనిరుధ్ ఇన్.. చెర్రీ సజెస్ట్..!
RC17 : రామ్‌చరణ్, సుకుమార్ మూవీ ఇంకా ట్రాక్ ఎక్కనే లేదు.. రోజుకో గాసిప్ చక్కర్లు కొడుతోంది
- Thota Vamshi Kumar
- Published on- October 29, 2026 / 08:54 AM IST
Is Anirudh joining Sukumar and Ram Charans RC17
RC17 : రామ్‌చరణ్, సుకుమార్ మూవీ ఇంకా ట్రాక్ ఎక్కనే లేదు.. రోజుకో గాసిప్ చక్కర్లు కొడుతోంది. నవంబర్ ఫస్ట్‌న RC17 లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్‌ను ఎంపిక చేయాలనే ఆలోచన వెనుక రామ్‌చరణ్ సూచన ఉందంటూ ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.
RC17 మ్యూజిక్ డైరెక్టర్‌గా ధురంధర్ మూవీ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రామ్‌చరణ్ అనిరుధ్ పేరును సజెస్ట్ చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొత్త చర్చ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన సినిమాల్లో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు.
అలాంటిది చరణ్, సుకుమార్ కాంబోకు అనిరుధ్ సంగీతం అందిస్తే ఆల్బమ్ ఏ రేంజ్‌లో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంటోంది. అయితే సంగీత దర్శకుడి ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి. అయితే RC17 మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించట్లేదని విషయాన్ని చెప్పకనే చెప్తున్నారన్న చర్చ జరుగుతోంది.
