Buchibabu Sana : బండ్ల గణేష్ కొడుకు హీరోగా బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ?
పెద్ది సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు (Buchibabu Sana) నెక్ట్స్ మూవీ కోసం వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది
- Thota Vamshi Kumar
- Published on- August 12, 2026 / 09:30 AM IST
Is Buchibabu Sana next project with Bandla Ganesh son Hiresh
Buchibabu Sana : పెద్ది సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ కోసం వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఆ రేంజ్ హిట్ కొట్టాక నెక్ట్స్ ఎవరితో మూవీ పట్టాలెక్కించబోతున్నాడా అని ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడిచింది. ఐతే దీనికి ఆన్సర్ దాదాపు దొరికేసింది. టాలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న ఓ ఆసక్తికరమైన టాక్ ఏంటంటే.. మరోసారి ఓ కొత్త హీరోని పరిచయం చేసే ఛాన్స్ రాబోతుందట.
ఈసారి హీరోగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తనయుడు హిరేష్ పేరు వినిపిస్తోంది. బండ్ల గణేష్ కుమార్తె సంగీత్ వేడుకలో హిరేష్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిరేష్ లుక్స్, డాన్స్‌పై కూడా నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. దీంతో హిరేష్‌ను హీరోగా లాంచ్ చేయాలనే ఆలోచనలో బండ్ల గణేష్ ఉన్నారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.ఇక ఈ ప్రాజెక్ట్‌కు బుచ్చిబాబు దర్శకత్వం వహించే అవకాశం ఉందనే గుసగుసలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గోరింటాకు ఫోటోలు..
ఈ సినిమాను స్వయంగా బండ్ల గణేష్ నిర్మించబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. బండ్ల కూతురు సంగీత్ వేడుకలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన హితేష్.. అదరగొట్టేశాడు. కొడుకు డ్యాన్స్ చూసి బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడిని జీవితంలో ఉన్నత స్థాయిలో చూడాలని ఎన్నో కలలు కన్నానని ఎమోషనల్ అయ్యారు. హితేష్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫ్యూచర్‌లో హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఐతే హితేష్, బుచ్చిబాబు కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజంగా ఇది వర్కౌట్ అవతుందా? బండ్ల గణేష్ తన కొడుకును హీరోగా లాంచ్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.
