Chiranjeevi : క్రేజీ కాంబో.. మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ!

మన శంకర వరప్రసాద్‌గారు అంటూ సంక్రాంతికి పలకరించి సూపర్ హిట్ కొట్టి మెగాస్టార్ చిరు (Chiranjeevi) వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు.

Is Chiranjeevi to Work With Karthik Subbaraj

Chiranjeevi : మన శంకర వరప్రసాద్‌గారు అంటూ సంక్రాంతికి పలకరించి సూపర్ హిట్ కొట్టి మెగాస్టార్ చిరు.. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఈ మధ్యే రిలీజ్ అయిన కాకా టీజర్‌.. కాక పుట్టిస్తోంది. అంచనాలు పెంచేసింది. ఐతే ఇప్పుడు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. మెగాస్టార్‌తో భేటీ కావడం టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

చిరంజీవి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథను.. కార్తీక్ వినిపించినట్టు టాక్‌. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ కథా చర్చలో ప్రాజెక్ట్‌కు.. సంబంధించిన పూర్తి వివరాలను దర్శకుడు వివరించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు.. కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్‌లో ఉండే డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌ను జోడించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Deviyani Sharma : మాట‌ల‌కు అంద‌ని అనుభ‌వం.. అక్కడ ‘గతం’ లేదు, ‘భవిష్యత్తు’ లేదు.. దేవియాని శర్మ ఫోటోలు వైర‌ల్‌..

దీంతో అసలు కార్తీక్ చెప్పిన కథ ఏ జోనర్‌.. చిరంజీవిని ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే కథ విన్న తర్వాత చిరంజీవి నుంచి ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం రాలేదని టాక్. దీంతో కథలో మార్పులు, చేర్పులు అవసరమా.. లేదంటే ఇదే కథతో ముందుకు వెళ్లాలా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

చిరంజీవి గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే.. కాంబినేషన్ అధికారికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్‌ది స్పెషల్‌ మేకింగ్ స్టైల్‌. పిజ్జా, జిగర్తాండ, పేట, మహాన్‌లాంటి సినిమాలతో డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే, స్టైలిష్ ట్రీట్‌మెంట్, బలమైన క్యారెక్టరైజేషన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

కమర్షియల్ అంశాలను తనదైన టేకింగ్‌తో చెప్పడమే కాకుండా.. కథను బట్టి మేకింగ్‌ను మార్చుకోవడం అతని ప్రత్యేకత. ఈ మధ్యే వచ్చి దోరతి కూడా తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఐతే చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్‌లో మెగాస్టార్‌ను చూడటం టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ ఆసక్తికరమైన కాంబినేషన్‌గా మారే అవకాశం ఉంది.