Lenin Movie: అఖిల్ లెనిన్ మరోసారి వాయిదా?
అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ (Lenin Movie) చిత్రం మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 13, 2026 / 12:51 PM IST
Akhil Akkineni Lenin movie to postpone
Lenin Movie: అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం లెనిన్. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేం మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. శివాజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈచిత్రం మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల జూలై తొలివారంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్‌డేట్ లేదు. తొలుత ఈ చిత్రాన్ని మే1 విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల జూన్ 26కు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు కూడా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
*Shivathmika : రాజశేఖర్ కూతురు శివాత్మిక.. క్యూట్ ఫోటోలు..
అఖిల్ అక్కినేని కెరీర్‌కు లెనిన్ సినిమా ఎంతో కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించలేదు. ఈ క్రమంలోనే గ్రామీణ నేపథ్యంలో, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న లెనిన్‌లో అఖిల్‌ను కొత్త కోణంలో చూపించనున్నారు అనే టాక్ ఉంది.
