Rajamouli : జక్కన్న మహాభారతం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్.!?
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలల ప్రాజెక్ట్ మహాభారతం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 08:44 AM IST
Is Rajamouli Mahabharat movie Script work begun
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ మహాభారతం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా మొదలైందట. ముఖ్యంగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌పై ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం జక్కన్న చేస్తున్న వారణాసి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా..ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి మహాభారతం కథను కొత్త కోణంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కథను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, ప్రతి పాత్రకు బలమైన ఎమోషన్, విజువల్ గ్రాండియర్ ఉండేలా డిజైన్ చేస్తున్నారట.
Maanasa choudhary : రెట్రో లుక్‌లో ‘బబుల్ గమ్’ బ్యూటీ.. మానస చౌదరి ఫోటోలు..
ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులుగా ఎవరు యాక్ట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్, కొలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి కీలక పాత్రకు సరిపోయే స్టార్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసి, మహాభారతాన్ని ఎన్నడూ చూడని స్థాయిలో తెరకెక్కించాలనే లక్ష్యంతో జక్కన్న టీమ్ పని చేస్తున్నట్టు సమాచారం.
Shivani Nagaram : చెన్నైలో తెలుగు నటి.. అష్టలక్ష్మీ దేవాలయంలో శివానీ నాగారం..
మహాభారతం ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ టాక్ మాత్రం ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తుంది. మహాభారతం ప్రాజెక్ట్ నిజమైతే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
