Trisha : సినిమాలకు బ్రేక్… త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ త్రిష (Trisha) నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Is Trisha to Quit Acting Political Entry

Trisha : తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ త్రిష..నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తిరుచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం విజయ్ తన పార్టీ టీవీకే తరఫున ఎవరిని బరిలోకి దింపుతాడోనన్న సస్పెన్స్‌ కొనసాగుతున్న వేళ, అనూహ్యంగా త్రిష పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం కెరీర్ పీక్‌లో ఉన్న త్రిష, భారీ సినిమాలకు కూడా నో చెప్పేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయం అయ్యిందా అన్న ప్రచారం మరింత ఊపందుకుంది.

Kajal Aggarwal : మోడ్ర‌న్ డ్రెస్‌లో మెరిసిపోతున్న చంద‌మామ‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటోలు వైర‌ల్‌..

కరుప్పు సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రిషకు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ, వాటిని తిరస్కరిస్తుందట. తిరుచ్చి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే త్రిష సినిమాలకు సైన్ చేయట్లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఎంత ప్రాజెక్టులో ఆఫర్‌ వచ్చినా ఆమె నో చెప్తున్నారని అంటున్నారు.

ఒక్క సినిమా కూడా సైన్ చేయకుండా త్రిష తన ఫుల్ ఫోకస్ రాజకీయాలపైనే పెట్టిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియకపోయినా, త్రిష పొలిటికల్ ఎంట్రీపై మాత్రం ఆమె నుంచి కానీ..టీవీకే పార్టీ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం నిజమైతే, సౌత్ సినీ ఇండస్ట్రీలో, దక్షిణాది పాలిటిక్స్‌లో చరిత్రలో నిలిచిపోయే డెవలప్‌మెంట్‌ అవుతుందని అంటున్నారు.