Isakapatnam Trailer : ‘ఇసకపట్నం’ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఎందులో?
మీరు కూడా ఇసకపట్నం ట్రైలర్ చూసేయండి.. (Isakapatnam)
- Saketh U
- Updated on- June 15, 2026 / 04:34 PM IST
Aishwarya Rajesh Isakapatnam Official Trailer Released
Isakapatnam Trailer: తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మాణంలో గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇసకపట్నం. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించగా సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
నేడు ఇసకపట్నం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్ టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
Also Read – Merin Philip : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మలయాళీ కుట్టి.. మెరిపిస్తున్న మెరిన్ ఫిలిప్..
మీరు కూడా ఇసకపట్నం ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో నేరాలు, రాజకీయాలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత విధేయతలు ఒకదానితో ఒకటి ఢీకొనే కథాంశంతో ఈ సిరీస్ యాక్షన్, ఎమోషన్, లవ్, సస్పెన్స్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ.. ఇసకపట్నం ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినా ఇందులో పాత్రలు, వారి భావోద్వేగాలు నిజాయితీగా ఉంటాయి. ఆశ, ప్రేమ, కోల్పోవడం, ప్రతీకారం వంటి అంశాలు అందరికి కనెక్ట్ అవుతాయి అని తెలిపారు.
