Rocking Rakesh : తన సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా KCR (కేశవ చంద్ర రమావత్).

Jabardast comedian Rocking Rakesh who sold his movie KCR tickets himself

Rocking Rakesh : జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా KCR (కేశవ చంద్ర రమావత్). ఇక సినిమాలో కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా ఉన్నారు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్. కాగా ఈ సినిమా నేడు విడుదలై థియేటర్స్ లోకి వచ్చింది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ గరుడవేగ అంజి దర్శకత్వంలో తెరక్కింది. సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

Also Read : Mohan Babu : నటుడిగా మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రయాణం..

అయితే ఈ సినిమా నేడు విడుదల కావడంతో తన మొదటి సినిమా మొదటి టికెట్ తానే స్వయంగా అమ్మారు. దీనికి సంబందించిన ఓ వీడియో సైతం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక ఆ వీడియోలో టికెట్ కౌంటర్ లోకి వెళ్లి తనే స్వయంగా టికెట్ అమ్మారు. టికెట్స్ తీసుకుంటున్న ఆడియన్స్ కి థాంక్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో హీరోగా తన మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.


అయితే ఇటీవల తన KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత కూడా ఆ సినిమా పోస్టర్ స్వయంగా తనే రోడ్లపై అంటించాడు. ఆ వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పటికీ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ వచ్చారు. అలాగే రోజా సైతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చింది.