Patas Praveen : తండ్రయిన జబర్దస్త్ కమెడియన్.. కూతురు పుట్టిందంటూ హాస్పిటల్ నుంచి ఎమోషనల్ పోస్ట్..
నేడు వంశిత పండంటి పాపాయికి జన్మనిచ్చింది. (Patas Praveen)
- Saketh U
- Published on- November 11, 2026 / 05:55 PM IST
Patas Praveen
Patas Praveen : జబర్దస్త్, పటాస్ షోలతో కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రవీణ్ ఇప్పుడు పండంటి పాపకు తండ్రయ్యాడు. ప్రవీణ్.. కడెం వంశిత అనే డ్యాన్సర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ఈ జంట సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వంశిత తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Also Read : Megaverse : మెగాస్టార్ ‘మెగావర్స్’ షో.. ఆ ఫ్యామిలీ స్పెషల్ ఎపిసోడ్.. షూటింగ్ పూర్తి..
నేడు వంశిత పండంటి పాపాయికి జన్మనిచ్చింది. దీంతో తనకు పాపాయి పుట్టిందని ప్రవీణ్ హాస్పిటల్ నుంచి వీడియో షేర్ చేసాడు. ఈ వీడియోలో ప్రవీణ్ తన భార్యకు సేవలు చేయడం, వంశిత ఆపరేషన్ థియేటర్ కి వెళ్లడం, డాక్టర్ పాపని తీసుకురావడం, పాపని ఎత్తుకొని తండ్రిగా ప్రవీణ్ ఆనందపడటం చూపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా పలువురు నెటిజన్లు, టీవీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
