Mukku Avinash : కొత్త కారు కొన్న అవినాష్.. మండిపడుతున్న నెటీజన్లు.. ఎందుకంటే..?
జబర్దస్త్ షోతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముక్కు అవినాశ్(Mukku Avinash). తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. మొన్నామధ్య బిగ్‌బాస్‌కు కూడా వెళ్లి వచ్చాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 24, 2023 / 02:19 PM IST
mukku avinash buy car
Mukku Avinash Buy Car : జబర్దస్త్ షోతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముక్కు అవినాశ్(Mukku Avinash). తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. మొన్నామధ్య బిగ్‌బాస్‌కు కూడా వెళ్లి వచ్చాడు. తరువాత బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోలలో పార్టిసిపేట్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నాడు. సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగానే సంపాదించుకుంటున్నాడు.
తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొపెషన్‌కు సంబంధించిన అంశాలను వీడియోలు తీసి యూ ట్యూబ్ ఛానల్‌లో పెడుతున్నాడు. అతడి భార్య అనూజ గర్భిణీ అన్న విషయాన్ని సైతం యూట్యూబ్ ద్వారానే వెల్లడించారు. మరో వీడియోలో తండ్రి కాబోతున్నానని ఆనందించే లోపే తన తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని చెప్పాడు. ఆమెకు గుండెలో స్టంట్ కూడా వేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందని తెలుస్తోంది.
BiggBoss 7 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ కి అర్థం తెలిసిపోయింది.. నాగార్జున బయట పెట్టేశాడుగా..!
తాజాగా కొత్త కారు కొన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పాత కారుకు యాక్సిడెంట్ అయ్యిందని, అది డ్యామేజ్ కావడంతో ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త కారు తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొన్నట్లు తెలిపాడు. కాగా.. ఈ కారు విలువ దాదాపు రూ.25లక్షలు ఉంటుందని తెలుస్తోంది. కొత్త కారును పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశాడు.
దీనిపై నెటీజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పావు గదా..? ఇప్పుడు కొత్త కారు అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు.
Baby 9 Days Collections : కలెక్షన్లలో ‘బేబీ’ జోరు.. 9 రోజుల్లోనే ఇన్ని కోట్లా?
