Jabardasth Ram Prasad : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఏడవ కంటెస్టెంట్.. జబర్దస్త్ వదిలేసి వచ్చిన కమెడియన్..
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. (Jabardasth Ram Prasad)
- Saketh U
- Published on- September 6, 2026 / 08:53 PM IST
Jabardasth Ram Prasad
Jabardasth Ram Prasad : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. రచయితగా సినీ, టీవీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో రచయితగా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్ గా మారాడు. తన స్కిట్స్, పంచులతో ఆటో రామ్ ప్రసాద్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ స్కిట్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
